డిస్కవరీ ఛానెల్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై డాక్యుమెంటరీ ప్రసారం..

113
Kaleshwaram
- Advertisement -

సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రపంచ ప్రఖ్యాత చానల్‌ ‘డిస్కవరీ ఛానెల్’లో జూన్ 25వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. మూడే మూడేండ్ల కాలంలో జలభాండాగారంగా ఆవిర్భవించిన కాళేశ్వరం ప్రాజెక్టు చారిత్రక ప్రస్థానాన్ని ప్రపంచం తెలుసుకోబోతున్నది. కాళేశ్వర చరిత్రను ‘లిఫ్టింగ్‌ ఎ రివర్‌’ అన్న పేరిట డాక్యుమెంటరీ ప్రసారం చేయనున్నది. ఢిల్లీకి చెందిన పల్స్‌ మీడియా ప్రొడక్షన్‌ నేతృత్వంలో తెలంగాణకే చెందిన డైరెక్టర్‌ రాజేంద్ర శ్రీవాత్సవ నేతృత్వంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించింది.

ప్రపంచంలో ఇప్పటి వరకు అమెరికాలోని కొలరాడో, ఈజిప్టులోని గ్రేట్‌ మ్యాన్‌ మేడ్‌ రివర్‌లో నిర్మించిన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌లు అతి పెద్దవిగా రికార్డులు నమోదు చేయగా, వాటిని తలదన్నే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అతి పెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించింది. ప్రాజెక్ట్‌ నిర్మాణం అంతా రికార్డులమయంగా మారిపోయింది.

- Advertisement -