- Advertisement -
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 54,069 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 1321 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,82,778కు చేరగా ఇప్పటివరకు కరోనా నుండి 2,90,63,740 మంది బాధితులు కోలుకున్నారు.
కరోనాతో ఇప్పటివరకు 3,91,981 మంది మృతి చెందగా జాతీయ రికవరీ రేటు 96.61శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.91శాతంగా ఉండగా ఇప్పటి వరకు మొత్తం 39.78 కోట్ల కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- Advertisement -