డుప్లెసిస్‌ త‌ల‌కు గాయం..

305
Faf du Plessis
- Advertisement -

దక్షిణాఫ్రికా సీనియర్‌ ఆటగాడు ఫాఫ్‌ డు ప్లెసిస్‌ గాయపడ్డాడు. బౌండరీ లైన్‌ దగ్గర మరో ఆటగాడిని గట్టిగా ఢీ కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. పాకిస్థాన్‌ సూపర్‌లీగ్‌ టోర్నీలో భాగంగా అబుదాబిలోని షేక్ జ‌యేద్ స్టేడియంతో క్వెట్టా గ్లాడియేటర్స్‌, పెషావర్‌ జల్మి జట్ల మధ్య మ్యాచ్ జ‌రిగింది. ఫీల్డింగ్ చేస్తోన్న స‌మయంలో బ్యాట్స్‌మ‌న్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద డైవ్‌చేసి ప‌ట్టుకునే క్ర‌మంలో మరో ఆటగాడు మహమ్మద్‌ హస్‌నెయిన్‌కు డుప్లెసిస్ తాకాడు.

దీంతో హసనెయిన్‌ మోకాలు డుప్లెసిస్‌ త‌ల‌కి బలంగా తాకింది. దీంతో వెంట‌నే డుప్లెసిస్‌ కళ్లు తిరిగి పడిపోవ‌డం గ‌మనార్హం. ఆయ‌న‌కు ఏం జ‌రిగిందోన‌న్న ఆందోళన అక్క‌డున్న వారంద‌రిలో క‌లిగింది. ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. ఆసుప‌త్రిలో ఆయ‌నకు స్కానింగ్ తీసిన వైద్యులు ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

- Advertisement -