సర్దార్ సర్వాయి పాపన్నపై కవిత సంకలనం ఆవిష్కరణ..

136
- Advertisement -

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన నివాసంలో తెలుగు భాషా చైతన్య సమితి, లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుజన తొలి చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నపై రూపొందించిన కవిత సంకలనంను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని కులాలను, మతాలను సమానంగా ఆదరించిన గొప్ప బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న అని అభివర్ణించారు. ఈ కవిత సంకలనంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (4) రాష్ట్రాల నుండి 100 మంది కవులు తమ అమూల్యమైన కవితలతో ఈ సంకలనంను రూపొందించారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో బడేసాబ్, ఓంకార్, మల్లయ్య, శ్రీనయ్య, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -