పుట్టినరోజున మొక్కలు నాటిన ఎంపీ లింగయ్య యాదవ్‌..

50
MP Lingaiah Yadav

రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ తన పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు ఎంపీ సంతోష్‌క కుమార్‌ పిలుపు మేరకు సూర్యాపేటలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమళ్ల అన్నపూర్ణ, మార్కెట్ చైర్ పర్సన్ ఉప్పల లలిత తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ లింగయ్య మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అద్భుతమైందని..పర్యావరణ పరిరక్షణ కోసం సంతోష్‌ కుమార్‌ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు.తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.