పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో త్వరలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. రూ. కోటి వ్యయంతో నిర్మించిన సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మహమూద్ అలీ..రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు వేల సంఖ్యలో రిక్రూట్ చేశామని తెలిపారు.
మహిళకు ప్రాధాన్యత ఇస్తూ నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో శిక్షణ పొందిన మహిళా కానిస్టేబుల్‌ను రిసెప్షనిస్ట్‌గా నియమించడం ద్వారా సామాన్య ప్రజలు ఎటువంటి భయం లేకుండా పోలీస్ స్టేషన్‌కి వస్తున్నారని వెల్లడించారు. శాంతిభద్రతలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని…దేశంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో 70 శాతం తెలంగాణలోనే ఉన్నాయన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషించిందని…..గతేడాది కాలంగా లాక్డౌన్ సమయాల్లో పోలీసులు చేస్తున్న త్యాగాలను హోంమంత్రి ప్రశంసించారు.