5 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చిన జియో!

142
jio
- Advertisement -

అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల డేటాపై డెయిలీ లిమిట్ ఎత్తేసింది. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ. 127 నుంచి రూ. 2,397 వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్లు 15 రోజుల నుంచి 365 రోజుల వరకు వేర్వేరు వ్యాలిడిటీలతో అందుబాటులో ఉన్నాయి.

బేసిక్ ప్లాన్ లో రూ. 127 ప్రీపెయిడ్ ప్లాన్ 12జీబీని అందిస్తుండగా రూ.2347 ప్లాన్‌లో 365 జీబీని అందిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, స్థిరమైన డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్లతో జియో టీవీ, జియో సినిమా,జియో న్యూస్ సహా యుటిలిటీ యాప్ లను కూడా యాక్సస్ చేసుకోవచ్చు.

ఈ ప్లాన్ ధర రూ. 247 రోజువారీ పరిమితులు లేకుండా 30 రోజులు వ్యాలిడిటీ పొందవచ్చు. దీనిపై 25జీబీ డేటాను పొందవచ్చు. రూ. 98 జియో రీఛార్జ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు రోజువారీ 1.5 జీబీ హై-స్పీడ్ డేటా పొందవచ్చు.

- Advertisement -