ఇకపై కరోనా నిర్దారణ పరీక్ష తక్కువ ధరకే చేయవచ్చు. అది కేవలం రూ.60కే..కేవలం 3 గంటల్లోనే రిజల్ట్ రానుంది. సెంటర్ ఫర్ సెల్యూలార్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) ఈ కిట్‌ని అభివృద్ధి చేసింది.
తాము తయారు చేసే ఒక్కో కిట్‌తో 100 పరీక్షలు చేయవచ్చని, ఒక్కో పరీక్షకు అయ్యే వ్యయం రూ.45 నుంచి రూ.60 మధ్య ఉంటుందని మెరిల్ సంస్థ తెలిపింది. పొడి పరీక్ష కిట్లను తయారు చేస్తున్న తొలి సంస్థ మాదే. దీంతో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష ఫలితాలు వేగంగా వెల్లడించేందుకు వీలవుతుంది. నెలకు 2 కోట్ల కిట్లను తయారు చేసే సామర్థ్యం మాకుందని మెరిల్ ఉపాధ్యక్షుడు సంజీవ్ భట్ తెలిపారు.
కోవిడ్ వ్యాధి నిర్ధారణకు ముక్కు లేదా నోటి లోపల ఉండే ద్రవాలను పొడవాటి పుల్లల్లాంటి వాటితో సేకరిస్తారు. వీటినే స్వాబ్స్ అంటారు. ఆర్‌టీపీసీఆర్ టెస్టులు జరిగే కేంద్రాలకు ఈ నమూనాలను తీసుకెళ్లాలంటే వాటిని వైరల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియం (వీటీఎం) ద్రావణంలో ఉంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది.స్వాబ్స్‌లోని జీవ పదార్థాన్ని జాగ్రత్త పరిచేందుకు కొన్ని రీఏజెంట్లను కూడా వాడతారు. ఇవేవీ లేకుండా పొడిగా ఉండే స్వాబ్స్‌ని పరీక్ష కేంద్రాలకు తరలించే కొత్త టెక్నాలజీనే స్వాబ్స్.