ఏనుగులకు కరోనా టెస్టులు!

20
elehent

కరోనా సెకండ్ దేశాన్ని అతలాకుతలం చేసింది. సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోగా సెకండ్ వేవ్ ప్రభావం మ‌నుషుల‌తో పాటుగా జంతువుల‌పై కూడా ప‌డింది.

త‌మిళ‌నాడులోని వండ‌లూరు జంతు ప్ర‌ద‌ర్శ‌న శాల‌లోని సింహాలు క‌రోనా బారీన పడగా వాటికి కరోనా టెస్టులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర అటవీ శాఖ. నీల‌గిరి జిల్లా మ‌ధుమ‌లై పులుల అభ‌యార‌ణ్యం స‌మీపంలోని తెప్ప‌కాడు, టాప్‌స్లిప్ ఏనుగుల శిభిరాల్లో ఉన్న 52 ఏనుగుల‌కు క‌రోనా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు.

ఏనుగుల ముక్కు, గొంతు నుంచి న‌మూనాల‌ను సేక‌రించి వాటిని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప‌శుగ‌ణ ప్ర‌యోగ‌శాల‌కు పంపించారు. ఏనుగులతో పాటు వాటి సంరక్షకులకు కరోనా టెస్టులు నిర్వహించామని…రిజల్ట్‌ని బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు అధికారులు.