లాక్‌డౌన్‌ ఎత్తివేతపై ప్రణాళిక ఇదే..!

131
icmr
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే సడలింపులతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ని ఎత్తివేస్తుండగా ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందుకోసం మూడు అంశాల ప్రణాళికను వెల్లడించింది.

త‌క్కువ పాజిటివిటి రేటు, అత్య‌ధిక మందికి టీకాలు, కోవిడ్ నిబంధ‌న‌ల‌తో కూడిన ప్ర‌వ‌ర్త‌న‌ల వంటి అంశాల‌ను రాష్ట్రాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని లాక్‌డౌన్‌ల‌పై నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఐసీఎంఆర్ పేర్కొంది.

కోవిడ్ ముప్పు అధికంగా ఉన్న వ‌ర్గాల‌కు 70శాతానికి పైగా వ్యాక్సిన్ టీకాలు వేసి సామాజిక బాధ్య‌త‌గా ప్ర‌జ‌లు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తుంటే ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్ ను ఎత్తివేయ‌వ‌చ్చ‌ని ఐసీఎంఆర్ ఛీఫ్ బ‌ల‌రాం భార్గ‌వ వెల్లడించారు.

- Advertisement -