- Advertisement -
నేడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారకరామారావు 99వ జయంతి. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, ఖ్యాతిని కాపాడిన ఎన్టీఆర్…కళామతల్లి ముద్దుబిడ్డగా కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు.
ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తాతను గుర్తు చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన …మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది… మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది… పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకి పో తాతా… సదా మీ ప్రేమకు బానిసను… నందమూరి తారకరామారావు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
- Advertisement -