ద‌ర్శ‌కేంద్రుడికి చిరు శుభాకాంక్ష‌లు..

127
- Advertisement -

శనివారం ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్రరావు జన్మదినం. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు మెగాస్టార్‌ ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్‌ చేశారు.

‘‘రాఘవేంద్రరావుగారి సినీ ప్రస్థానంలో అత్యధిక చిత్రాల కథానాయకుడిగా నాకు ఓ ప్ర‌త్యేక‌త ల‌భించింది. ఆ రకంగా మా కాంబినేష‌న్ ఎంతో స్పెష‌ల్‌. నా స్టార్ డ‌మ్‌ని, క‌మ‌ర్షియ‌ల్ స్థాయిని పెంచిన ద‌ర్శ‌కుడు. తెలుగు చిత్రాల్లో ఎప్ప‌టికీ అపురూపంగా నిలిచే ‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి’ లాంటి చిత్రాన్ని నాకు కానుక‌గా ఇచ్చిన ద‌ర్శ‌కేంద్రుడు శ్రీ రాఘ‌వేంద్ర‌రావుగారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ప్రార్థిస్తున్నాను’’ అన్నారు.

చిరంజీవి, రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్‌లో ‘మంచి దొంగ‌, అడ‌విదొంగ‌, రుద్ర నేత్ర‌, చాణక్య శ‌ప‌థం, యుద్ధ‌భూమి, జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి, ఘ‌రానా మొగుడు, రౌడీ అల్లుడు, ఇద్ద‌రు మిత్రులు’ చిత్రాలు రూపొందాయి.

- Advertisement -