కోవిడ్ వాక్సిన్ తీసుకున్న కీర్తి సురేష్‌

49
Keerthy Suresh

కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా సినీ ప్రముఖులు కోవిడ్ వాక్సిన్ తీసుకుంటున్నారు. కరోనా వైరస్ నుండి తమను తాము రక్షించుకోవడం కోసం వాక్సిన్ తీసుకోవడం జరుగుతుంది. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కోవిడ్ వాక్సిన్ తీసుకున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కరోనా టీకా తొలి డోసు తీసుకోగా, ఆ ఫోటోని కీర్తి సురేష్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలని కోరింది..

ఇక నేను శైల‌జ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన కీర్తి సురేష్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కుతున్న స‌ర్కారు వారి పాట చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌లో ఇప్ప‌టికే జాయిన్ అయిన కీర్తి దుబాయ్‌లో జ‌రిగిన కొన్ని స‌న్నివేశాల‌లో పాల్గొంది. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మైన ఈ ముద్దుగుమ్మ ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెడుతుంది.