ప్రభుత్వ వైద్యం మీద భరోసా కల్పించిన ఘనత తెలంగాణది..

125
- Advertisement -

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యం మీద భరోసా కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కరోనా పేషంట్స్ లో ఆత్మ స్థైర్యం నింపడానికి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం సీఎం కేసీఆర్ చేశారు.. ప్రైవేట్ ఆసుపత్రిల్లో తక్కువ ధరకు వైద్యం అందేలా చర్యలు తీసుకున్నాం. స్కానింగ్ ధరలు రూ.1999 నిర్ణయించాము.

దహన సంస్కారాలు చేయడం కష్టం అవుతుందని మా దృష్టికి వచ్చింది. కొంతమంది కరోనా మహమ్మారితో ప్రాణాలను కోల్పోయిన సంఘటనలో వారి కుటుంబ సభ్యులు భయంతో డెడ్ బాడీని ఆసుపత్రిలో వదిలేసి వెళ్లడం బాధాకరం. అలాంటి వారి కోసం మహబూబ్ నగర్ పట్టణంలో కరోనా మహమ్మారితో చనిపోయిన వారి అంత్యక్రియలను కేవలం 5 రూపాయలకే గ్యాస్ ఆధారిత ప్లాంట్ ద్వారా దహణసంస్కారాలను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో త్వరలోనే నిర్వహించబోతున్నం.

నెల రోజుల్లో రెండు ఎకరాల్లో గ్యాస్ ఆధారిత స్మశానవాటిక ను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. రాజకీయాలు మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదు. ప్రజల ప్రాణాలు కాపాడటం మన ముందున్న ఉన్న కర్తవ్యం. ప్రతిపక్షాలు కొవిడ్ కట్టడిలో కలిసి రావాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు.

- Advertisement -