కరోనా పాపం మోదీదే..సర్వే షాకింగ్ నిజాలు!

207
modi pm
- Advertisement -

దేశంలో కాషాయ పార్టీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తీసుకుంటున్ననిర్ణయాలు, చేపడుతున్న చర్యలు గగ్గోలెత్తిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అంటే ప్రజా వ్యతిరేక పార్టీ అన్న ముద్రను సంపాదించుకుంటోంది. చార్జీల పెంపు, ఎన్నడూ లేనిది పాల ధరల పెంపు, మండుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు, ఆకాశాన్నంటుతున్న బియ్యం, పండ్లు, కూరగాయలు, వంట గ్యాస్ ధరలు, దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న నిరుద్యోగం, ఇల్లా ఒక్కొక్కటిగా బీజేపీ సే సబ్ పరేషాన్ అనే విధంగా తయారైంది.

దీనికి తోడు కరోనా కట్టడిలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాల్చుతుండగా మరోవైపు ఆక్సిజన్ లేక ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. దీంతో ప్రజలు కేంద్రం తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కరోనాను కట్టడి చేయకపోగా వ్యాక్సిన్‌ పంపిణీలో సైతం రాష్ట్రాలకో రేటు,తమకో రేటు విధించడంపై మోదీ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది.

ఈ నేపథ్యంలో నిర్వహించి సర్వేలో భారతీయులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అన్నిరాష్ట్రాల్లో ప్రజల నుండి సేకరించిన ఈ సర్వేలో 60 శాతం మంది భారతీయులు కరోనాను కట్టడి చేయడంలో మోదీ విఫలమయ్యారని ఆరోపించారు. అంతేగాదు ఒక్కప్పుడు మోదీ ప్రసంగాలకు ఉర్రూతలూగిన వారు ఇప్పుడు మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం మినహా ఇంకేం చేయగలరు? మీ వాగాడంబరాన్ని కట్టి పెట్టండి.. అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఆత్మనిర్భర్ దేశానికి దుర్భరంగా మారిందని…స్మశానాల్లో శవాలకు కూడా స్థానం లభించకపోవడం, ఆత్మీయులు, సన్నిహితులు, సహచరులు, హితులు ఒక్కొక్కరూ నేలరాలిపోతుండడం వ్యవస్థలపై, ముఖ్యంగా మోదీపై ప్రజల్లో నమ్మకం క్రమంగా సడలిపోతోంది.

- Advertisement -