వ్యాక్సిన్‌ ధరలను తగ్గించండి: కపిల్ సిబాల్

49
kapil

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతుండటం, మరోవైపు వ్యాక్సిన్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కేంద్రం తీరుపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుండగా మోదీ సర్కార్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్. ప్రభుత్వం ఆర్టికల్‌ 370 కోసం ఆర్డినెన్స్‌ తీసుకురాగలదు కానీ వ్యాక్సిన్ల కోసం కాదు అని విమర్శించారు.

వ్యాక్సిన్ల ధరలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని…. ఎసెన్షియల్‌ కమోడిటీ యాక్ట్‌ కిందకు తీసుకువస్తే కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాల ధరలను నియంత్రించవచ్చన్నారు. 18 ఏళ్లుపైబడిన వారికి టీకాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత కాదా? అని ప్రశ్నించారు.