- Advertisement -
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతుండగా పిడుగులాంటి వార్తను అందించారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా.కరోనా ఇదేరీతిలో మార్పులకు గురవుతూపోతూనే.. దేశంలో మూడో విడత కల్లోలం కూడా రావొచ్చని హెచ్చరించారు.
కోవిడ్ వ్యాక్సిన్లు చాలామందికి చేరగలిగితే దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చన్న ఆయన… రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్ల వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఉండబోదని అభిప్రాయపడ్డారు. కానీ, తగిన గడువుతో లాక్ డౌన్ విధిస్తే ఫలితం ఉండొచ్చని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా కనీసం 2 వారాలు లాక్‌డౌన్ అమలు చేయాలని సూచించారు.
- Advertisement -