డిమాండ్ కు తగిన బొగ్గు అందింద్దాం: సీఎండీ శ్రీధర్

266
Singareni CMD N Sridhar
- Advertisement -

పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలకు తగినట్లుగా సింగరేణి సంస్థ నుండి తగినంత బొగ్గును అందించాలని, రోజుకు కనీసం ఒక లక్షా 90 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రవాణా కూడా చేయాలని సింగరేణి సంస్థ చైర్మన్ మరియుఎం.డి శ్రీ ఎన్. శ్రీధర్ కంపెనీ డైరెక్టర్లు మరియు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్ లను ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణిభవన్ నుంచి ఆయన మంగళవారం (మే 4న)వీడియో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి గత నెల ఉత్పత్తితో పాటు ఈనెల సాధించాల్సిన లక్ష్యాల పైన దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో పాటు సింగరేణి తో ఇంధన ఒప్పందం గల దక్షిణాది రాష్ట్రాల్లోనీ విద్యుత్ ఉత్పత్తి సంస్థలునుండి కూడా బొగ్గుకు మంచి డిమాండ్ ఉందని ,దీనికి అనుగుణంగా రోజుకు కనీసం 35 రేకులు( రైలు బండ్ల)కు తగ్గకుండా బొగ్గు రవాణా చేయటానికి ప్రణాళిక బద్దంగా ముందుకుపోవాలని జనరల్ మేనేజర్ లను కోరారు. వ్యాపారశైలి, నిపుణత, సామర్ధ్యాలతో నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని కోరారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించడానికి ఏరియాల వారీగా నే ఎప్పటికప్పుడు తగు నిర్ణయాలు తీసుకోవాలని ,ఈ విషయంలో జనరల్ మేనేజర్ లకు తానుఅనుమతులు ఇస్తున్నాననీ పేర్కొన్నారు.

ఓపెన్ కాస్ట్ గనుల కు కావలసిన పేలుడు పదార్థాలను మహారాష్ట్ర నుంచి నిరాటంకంగా సరఫరా చేయడం కోసం అనుమతించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశామని, దీనితోపాటు సింగరేణి నిర్వహిస్తున్న ఎస్ ఎం. ఈ ప్లాంట్ల నుండి ఉత్పత్తిని 150 శాతానికి పెంచడం ద్వారా పేలుడు పదార్థాల కొరత లేకుండా చూస్తున్నామని తెలియజేశారు.అడ్రియల లాంగ్వాల్ ప్రాజెక్టు కూడా ఏప్రిల్ నుంచి ఉత్పత్తి ప్రారంభించిందని, ఈ గని నుంచి ఇకనుండిరోజుకు కనీసం 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాలని కోరారు.

కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో సింగరేణిఏరియా ఆసుపత్రిల్లో ఆక్సిజన్ కొరత ఏమాత్రం లేకుండా చూసేందుకు సింగరేణి సంస్థ స్వయంగా రామగుండం ఏరియా ఆసుపత్రిలో ఒక ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ నుయుద్ధ ప్రాతిపదికన మరో పది రోజుల్లో నెలకొల్పి ఉత్పత్తి ప్రారంభించేల చూడాలని చైర్మన్ వెల్లడించారు .

దీని కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డైరెక్టర్ ఫైనాన్స్ శ్రీ ఎన్. బలరాంను కోరారు.ఇది ప్రారంభం అయ్యే లోపు పాల్వంచ మరియు ఇతర పట్టణంలో గల ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలనుండి ఆక్సిజన్ కొనుగోలుకు ఏర్పాటు చేయాలని డైరెక్టర్లు ను ఆదేశించారు .సింగరేణి సంస్థలో పనిచేసే ఫేస్ ఉద్యోగులను ఫ్రంట్లైన్ వారియర్లు గా గుర్తిస్తూ వారికి తక్షణమే వ్యాక్సిన్ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి తగినన్ని వ్యాక్సిన్లను సమకూర్చు తున్నా మని తెలిపారు.ఏరియా జనరల్ మేనేజర్ ప్రతి రోజు కనీసం గంట సేపు కరోనా పరిస్థితులను సమీక్షించాలనీ ఆదేశించారు.

ఆసుపత్రులు క్వారన్ టైన్ సెంటర్లో 24 గంటల పాటూ వైద్య సేవలు అందుబాటులో ఉంచే విధంగా తగు ఏర్పాటు చేయాలని వైద్య అధికారులు ఆదేశించారు. అవసరమయితే కావల్సినంత మంది డాక్టర్లు, సిబ్బంది నీ ఎక్కడికక్కడఏర్పాటుచేసి కోవాలని, ఖర్చు కు వెనకాడవద్దని కోరారు .ఆసుపత్రులకు అవసరమైన మందులు ఇంజక్షన్లు సమకూర్చామనీ, కార్మికులలో ఆత్మస్థైర్యం కల్పించడం కోసం అధికారులు కార్మిక సంఘాలతో కలిసి కృషి చేయాలన్నారు .

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించ రాదని హెచ్చరించారు ఈ సమావేశంలో సంస్థ ఛైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్. శ్రీధర్ తో పాటుఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , (బొగ్గు రవాణా)శ్రీ J.ఆల్విన్ , జనరల్ మేనేజర్ మార్కెటింగ్ మరియు కోఆర్డినేషన్ శ్రీ కే.సూర్యనారాయణ కార్పొరేట్ నుంచి శ్రీ ఎస్ .చంద్రశేఖర్( డైరెక్టర్ ఆపరేషన్స్ )శ్రీ ఎం బలరాం (డైరెక్టర్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్, పా) డైరెక్టర్ (ఈ& ఎం) శ్రీ డి సత్యనారాయణ రావు ,చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంతా శ్రీనివాస్ ఏరియాల నుంచి ఏరియా జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.

- Advertisement -