సామాజిక న్యాయం పాటించిన ఏకైక పార్టీ…టీఆర్ఎస్

226
Minister errabelli
- Advertisement -

జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటిస్తూ సీట్లు కేటాయించామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్‌లో ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఎర్రబెల్లి….అన్ని కులాలకు సమన్యాయం చేశాం….ఇప్పటివరకు ఏ పార్టీ ఇవన్ని రీతిలో బీసీలకు అవకాశం ఇచ్చామన్నారు.జనరల్ కేటగిరీలో ఎస్సీలకు అవకాశం కల్పించాం…..సామాజిక న్యాయం పాటించిన ఏకైక పార్టీ..టీఆర్ఎస్ ను గెలిపించాలిన్నారు. పట్టణం అభివృద్ధి బాటలో ఉంది….కష్ట కాలంలోనూ.. కరోనా కల్లోలంలోనూ వరంగల్ నగర అభివృద్ధికి పెద్దపీట వేశాం అన్నారు.

గత ఏ ప్రభుత్వం వరంగల్ ను ఆదుకోలేదు….ఈ నగరానికి కేంద్రం ఎలాంటి సాయం చేయలేదు….టీఆరెస్ చేస్తున్న అభివృద్ధితో వరంగల్ రూపు రేఖలు మారిపోతున్నాయన్నారు.మిషన్ భగీరథ ద్వారా 9039 కోట్లతో 1.50 లక్షల కనెక్షన్లు ఇచ్చాము…..డబుల్ బెడ్రూం ఇళ్లు, సమీకృత మార్కెట్లు నిర్మించాం
…నగరాన్ని సుందరీకరిస్తున్నాం….విలీన గ్రామాల్ని అభివృద్ధికి చేస్తున్నాం అన్నారు.మోడల్ వైకుంఠ దామాలు, పార్కులు నగరంలో పేదలకు ఇళ్ల పట్టాలు.. జర్నలిస్టులకు మోడల్ కాలనీ చేశామన్నారు.

గత ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆరెస్ అభివృద్ధి చేస్తోంది…ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్న ప్రజలు టీఆరెస్ ను ఆశీర్వదించండన్నారు.సోషల్ మీడియాలో బీజేపీ, కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నారు.. నమ్మకండన్నారు.బీజేపీ ని ఛీ అనే పరిస్థితి వచ్చింది…బీజేపీ అబద్ధాల పార్టీ….గ్రాడ్యుయేట్ ఓట్లతో పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ 4వ స్థానం ఇచ్చారన్నారు. కాళేశ్వరం, దేవాదుల నీరు తెచ్చి వరంగల్ ను సస్యశ్యామలం చేశాం కావాలని దుష్ప్రచారం చేసే వాళ్లకు వరంగల్ ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.

- Advertisement -