కరోనా సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయన్నారు మంత్రి ఈటల రాజేందర్. హుజురాబాద్ మండలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఈటల…ప్రత్యేక పూజలు చేశారు.
కరోనా నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఎన్ని వందల కోట్ల రూపాయాలైనా ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలన కాపాడుకుంటాం అన్నారు. వచ్చే కల్యాణోత్సవం అయినా కోట్లాది మంది సమక్షంలో జరగాలని ప్రార్థించానని తెలిపారు.
కరోనా అంతం కావాలని కోరుకున్నానని….. పాడి పంటలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి. కరోనా కష్ట కాలంలో ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ పారద్రోలాలన్నారు.. ప్రభుత్వానికి తోడుగా నిలవాలన్నారు. పాజిటివ్ కేసులు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆక్సిజన్, బెడ్ల కొరత లేకుండా ప్రజానీకాన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు.