- Advertisement -
ఐపీఎల్ సీజన్ 14 ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతుండగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు ఫ్రాంచైజీల ఆటగాళ్లు కరోనా బారీన పడ్డారు. ఇందులో కొంతమంది విదేశీ ఆటగాళ్లు ఉండటంతో వారంతా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక క్వారంటైన్ ముగిసి నెగటివ్ వచ్చిన వారు ఆయా జట్లలో చేరుతుండగా తాజాగా ఆర్సీబీకి మాత్రం షాక్ తగిలింది.
ఈ నెల 9న చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్‌తో సీజన్ ప్రారంభ మ్యాచ్‌కు ముందే మరో ఆటగాడు కరోనా వైరస్ బారినపడ్డారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్ కు పాజిటివ్‌గా తేలగా ఐసోలేషన్‌లో ఉంచినట్లు ఆర్‌సీబీ జట్టు ప్రకటించింది. ఇప్పటికే జట్టుకు చెందిన ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్ష చేశారు.
గత ఏడాది కరోనా నేపథ్యంలో దుబాయ్‌లో టోర్నీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సారి సీజన్‌ను సైతం కరోనా వెంటాడుతోంది.
- Advertisement -