‘చిత్రం’ సీక్వెల్‌తో తేజ తనయుడు!

35
director teja

‘చిత్రం’సినిమాతో మెగాఫోన్ పట్టిన దర్శకుడు తేజ. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తేజ తీర్చిదిద్దిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఆయ‌న కెరీర్‌లోనే ఒక ప్ర‌త్యేక‌మైన చిత్రంగా నిలిచింది. ఆర్పీ ప‌ట్నాయ‌క్ స‌మ‌కూర్చిన సంగీతం ఒక హైలైట్‌గా నిలవ‌డ‌మే కాకుండా, పాట‌ల‌న్నీ ఒక సెన్సేష‌న్‌ను సృష్టించాయి.

తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా చిత్రం 1.1ను అనౌన్స్‌ చేశారు తేజ. ఈ సినిమాతో తేజ తనయుడు హీరోగా పరిచయం కానున్నారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ‘అలమేలుమంగ- వెంకటరమణ’ సినిమాను రూపొందిస్తున్నాడు. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే ‘చిత్రం 1.1’ ను ప్రకటించగా తేజ తన తనయుడు ‘అమితోవ్ తేజ’ హీరోగా పరిచయం కానున్నారు. ఈ నెల 18వ తేదీన షూటింగు మొదలుకానుండగా దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.