పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో విడత ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ప్రక్రియలో భాగంగా ఓటేశారు కేరళ సీఎం పనరయి విజయన్,డీఎంకే స్టాలిన్,కమల్ హాసన్,రజనీకాంత్,అజిత్,సూర్య,కార్తీ.
కేరళ ప్రజలు ఈ సారి చరిత్ర తిరగరాయడం ఖాయమని ఓటేసిన అనంతరం సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. కేరళ ఓటర్లు ఒకేసారి అధికారంలో ఉన్న వారికి ఛాన్స్ ఇవ్వకుండా ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వడం ఇప్పటివరకు జరిగింది. అయితే ఈసారి విజయం తమదేనని ధీమాతో ఉన్నారు విజయన్.
ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. చివరి గంటలో ఓటు వేసేందుకు కరోనా బాధితులను అనుమతించనున్నారు. వీరి కోసం ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మూడో దశలో 31,తమిళనాడు 234, కేరళ 140, పుదుచ్చేరిలో 30 స్థానాలు,అసోంలో తుది విడత పోలింగ్‌లో భాగంగా 12 జిల్లాల్లోని 40 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మే 2న ఫలితాలు విడుదల కానున్నాయి.