సొంతపార్టీ నేతపైనే బీజేపీ ఖుష్బూ విమర్శలు..అంతలోనే!

168
khushbu
- Advertisement -

దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను గమనిస్తే..ఏ పార్టీ నేత ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నారో చెప్పలేం. పాతిక,ముప్పై సంవత్సరాల పాటు ఒకే పార్టీకి ప్రాతినిధ్యం వహించిన వారు సైతం రాత్రికి రాత్రే కండువా మార్చేసి రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెబుతున్నారు. అయితే అలాంటి వారు తాము ఏం మాట్లాడుతున్నామో, ఎవరిని విమర్శిస్తున్నామో కాసింత అవగాహనతో మాట్లాడితే వారికి విలువ ఉంటుంది. లేకుంటే నవ్వుల పాలు కావడం ఖాయం.

తాజాగా అలాంటి సంఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన సినీ నటి ఖుష్బూ థౌజెండ్ లైట్స్ నుండి బరిలోకి దిగారు. ప్రచారంలో భాగంగా సొంతపార్టీ ఎమ్మెల్యే పైనే నిప్పులు చెరిగారు. తర్వాత తన నాలుకు కరుచుకున్న అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

గత ఎమ్మెల్యే ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని నియోజకవర్గంలోని సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పక్కనే ఉన్న ఆ ఎమ్మెల్యే కేకే సెల్వం ఇబ్బందిపడ్డారు. అయితే జనం నవ్వుతుండటం చూసి తెరుకున్న ఖుష్బూ ఏమి చేయలేని పరిస్థితులో అలా మిన్నకుండిపోయారు. వాస్తవానికి సెల్వం ఎన్నికలకు ముందు డీఎంకే నుండి బీజేపీలో చేరారు. చివరి నిమిషనంలో ఖుష్బూకు సీటు కేటాయించగా ఆమెకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తుండగా చేదు అనుభవం ఎదురైంది.

- Advertisement -