గెలుస్తాననే విశ్వాసం లేదు..మోదీ కోసం బరిలో ఉన్నా: సురేష్‌ గోపి

159
suresh gopi
- Advertisement -

కేరళ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార ఎల్‌డీఎఫ్‌ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం ఖాయమని సర్వేలు చెబుతున్న తరుణంలో బీజేపీ నేత సురేష్ గోపి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలుస్తాననే విశ్వాసం లేదు..కానీ ప్రధానమంత్రి మోదీ అడిగారు కాబట్టి బరిలో ఉన్నానని తెలిపారు సురేష్‌ గోపి.

అసలు ఎన్నికల్లో పోటీ చేయాలని లేదని తప్పని సరి పరిస్థితుల్లో త్రిసూర్‌ నుండి బరిలో ఉన్నానని తెలిపారు. స్వల్ప అస్వస్తత నుండి కోలుకుని డిశ్చార్జ్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన ముందు ఆరోగ్యం ముఖ్యం, విశ్రాంతి కావాలి తర్వాతే ప్రచారం చేస్తా అని చెప్పారు.

ఎంపీ ఎన్నికల్లో కేరళ అంశాన్ని వాడుకుని ప్రయోజనం పొందాలని చూసిన కమలనాథులకు కేరళ ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే జరిగింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏమేర ప్రభావం చూపుతుందో వేచిచూడాలి.

- Advertisement -