నాటిన చెట్టుకు ఎరువు పోస్తున్న జీఎం నారాయణ

228
gic
- Advertisement -

గోదావరిఖని, రహదారి విస్తరణలో అడ్డంగా ఉన్న మామిడి చెట్లను తిరిగి నాటి సంరక్షించేందుకు సింగరేణి చర్యలు తీసుకుంది. ఓసీపీ-5 ఏర్పాటుతో రహదారి మళ్లింపు పనులు జరుగుతున్నాయి. ముస్త్యాల గ్రామ సరిహద్దులో 70 మామిడి చెట్లు రహదారికి అడ్డంగా ఉండటంతో వాటిని వేర్లతో సహా వెలికితీసి జీడీకే-1 గని సమీపంలోని నర్సరీలో తిరిగి నాటారు. 8 సంవత్సరాల వయస్సు కలిగిన మామిడి చెట్లు మళ్లీ చిగురించేలా నాటారు. వివిధ రసాయనాలు పూసి వాటిని తిరిగి నాటడం ద్వారా మళ్లీ పెరిగి పండ్లు అందించే అవకాశం ఉంటుంది. శుక్రవారం జీఎం నారాయణ ఎరువు వేసి మట్టిని నింపారు.ఆయన వెంట అధికారులు త్యాగరాజు, బెనర్జిబెంజమెన్‌, రమేశ్‌, అభిలాష్‌, వీరారెడ్డి ఉన్నారు.

- Advertisement -