- Advertisement -
కరోనా సెకండ్ వేవ్….ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. ఈ పేరు వింటేనే దేశలు భయభ్రాంతులకు గురవుతుండగా పారిస్ మాత్రం ఈ మహమ్మారి మూడో వేవ్‌తో మళ్లీ లాక్ డౌన్ బాటపట్టింది. పారిస్ సహా 16 రీజియన్లలో నేటి అర్థరాత్రి నుంచి లాక్‌డౌన్ అమల్లోకి రానుంది.
నెల రోజులపాటు ఈ లాక్ డౌన్ అమల్లో ఉండగా ప్రజలు తప్పనిసరైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ఆదేశ ప్రధాని జీన్ కాస్‌టెక్స్ వెల్లడించారు. ఒకవేళ వచ్చినా వారి ఇంటి నుంచి పది కిలోమీటర్ల దూరం వరకే అనుమతిస్తామని వెల్లడించారు.
గతేడాది మార్చి 16న లాక్‌డౌన్ విధించగా సరిగ్గా ఏడాది దాటిన మూడురోజుల్లోనే మళ్లీ లాక్ డౌన్ విధించింది. ఇక పారిస్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారచేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. వ్యాక్సిన్ వినియోగాన్ని మళ్లీ ప్రారంభించింది.
- Advertisement -