ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్…

60
kejriwal

దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ నడుస్తోందన్నారు సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం మంగళవారం మొత్తం 59,540 మందికి కరోనా టెస్టులు చేయగా, వారిలో 6,725 మందిని పాజిటివ్‌గా గుర్తించారు.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సీఎం కేజ్రీజవాల్..దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయని చెప్పారు. కొంతకాలంగా కొత్త‌గా న‌మోద‌య్యే కేసుల సంఖ్య త‌గ్గుతూ వ‌చ్చిన‌ప్ప‌టికీ మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

కేసుల సంఖ్య పెరుగుతుండంతో ఢిల్లీ అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంద‌ని తెలిపిన కేజ్రీవాల్…. ప‌రిస్థితిని తాము ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నామ‌ని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో మొత్తం 36,375 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తగ్గడం, చలి పెరగడం, పండుగల వాతావరణం ఇవన్నీ కరోనా కేసుల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.