దేశంలో 24 గంటల్లో 23,285 కరోనా కేసులు

172
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 23,285 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 117 మంది మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,13,08,846కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 1,97,237 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 1,09,53,303 మంది కరనా నుండి కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 1,58,306కు చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 1.74 శాతంగా ఉండగా రికవరీ రేటు 96.86 శాతం ఉంది. టీకా డ్రైవ్‌లో భాగంగా 2,61,64,920 మంది వ్యాక్సిన్ అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

- Advertisement -