ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయకుండా ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారో BJP నేతలు పట్టభద్రులకు సమాధానం చెప్పాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. బుధవారం GHMC పరిధిలోని సికింద్రాబాద్, అంబర్ పేట, ముషీరాబాద్, కంటోన్మెంట్, ఖైరతాబాద్, జూబ్లి హిల్స్ నియోజకవర్గాల సమావేశాలను ఎన్నికల ఇంచార్జి, మంత్రి గంగుల కమలాకర్, నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి లు సుంకే రవి శంకర్, నార్దాసు లక్ష్మణ్ రావు లతో కలిసి వేరువేరుగా నిర్వహించారు.
ఈ సమావేశాలలో స్థానిక MLA లు పద్మారావు గౌడ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, దానం నాగేందర్, మాగంటి గోపినాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ MLC గా ఎన్నికైన ప్రస్తుత BJP అభ్యర్ధి శ్రీ రాంచందర్ రావు ఏనాడైనా మండలి లో సమస్యల పై చర్చించారా? అని ప్రశ్నించారు. ఓట్లేసి గెలిపించిన పట్టభద్రులకు ఏం మేలు చేశారో చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాల నియామకం చేసిందో BJP నేతలు చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
ఈ సారైనా పట్టభద్రులు BJP నేతల కల్లబొల్లి మాటలకు మోసపోవద్దని, విద్యారంగంలో అపార అనుభవం కలిగిన విద్యావంతురాలు, అభ్యర్ధి శ్రీ సురభి వాణిదేవి కి మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. భారతదేశ గౌరవాన్ని ఎంతో ఇనుమడింప చేసిన స్వర్గీయ ప్రధాని శ్రీ PV నరసింహారావు కూతురు శ్రీ సురభి వాణిదేవి ని పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం గెలిపించాలని అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివిధ శాఖల లో ఒక లక్ష 32,899 ఉద్యోగాలని భర్తీ చేసిందని పేర్కొన్నారు. మరో 50 వేల ఉద్యోగాల భర్తీ కి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశించారని, ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.
ఎన్నో సంవత్సరాలుగా ముందుకు సాగని ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన ఘనత TRS ప్రభుత్వానిదేనని చెప్పారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం, ఉద్యోగాల నియామకం, పదోన్నతుల వంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయని, మరో మూడు సంవత్సరాలు తమా ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పట్టభద్రులు శ్రీ సురభి వాణి దేవి ని MLC గా గెలిపిస్తే ముఖ్యమంత్రి వద్దకు సమస్యలను తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఆయన వెల్లడించారు. TRS పార్టీ కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, నాయకులు, కార్యకర్తలు మొత్తం పట్టభద్రుల వద్దకు వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించి TRS పార్టీ అభ్యర్ధి కి అధిక ఓట్లు వేసే విధంగా సమిష్టి ప్రణాలికలతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. 50 మంది ఓటర్లకు ఒక కార్యకర్త ను ఇంచార్జి గా నియమించి పట్టభద్రుల వద్దకు నేరుగా వెళ్ళి TRS అభ్యర్ధి శ్రీ సురభి వాణిదేవి కి అత్యధిక ఓట్లను వేసే విధంగా చూడాలని కోరారు.