హైదరాబాద్ , రంగారెడ్డి , మహబూబ్ నగర్ , ఎం ఎల్ సి అభ్యర్థి సురభి వాణి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ బీసి సంక్షేమ , పౌరసరఫరాల శాఖా మంత్రివర్యులు గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.నేడు హైదరబాద్ , బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ క్లబ్ హౌస్ లో ఎమ్మెల్యేలు , ఇంచార్జులతో మంత్రి గంగుల కమలాకర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి హోంమంత్రి మహమూద్ అలీతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు అయ్యారు.హోమ్ మంత్రి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు శుభాకాంక్షలు తెలిపారు..
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం పని తీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల గుండెల్లోంచి వచ్చిందని ప్రజలకు పార్టీపై విశ్వసనీయత ఉన్నదని వెల్లడించారు. నియోజక వర్గ ఎం.ఎల్.ఎ ఇంచార్జులు కలిసి కట్టుగా అభ్యర్థి గెలుపు కోసం కష్టపడాలి. ఎం ఎల్ సి అభ్యర్థి సురభి వాణి కి ప్రజల ఆమోదం లబించిందని ప్రజలు ఓట్లు వేసేందుకు సిద్దంగా ఉన్నారని, ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు తీసుకు వచ్చే భాద్యత కార్యకర్తలదేనని తెలిపారు. అధికార టి.ఆర్.ఎస్ పార్టీ తోనే పట్టభద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి తెలిపారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరబాద్ లోని అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి ని భారి మెజార్టీ తో గెలిపించుకోవాలని సూచించారు. గతంలో మండలి కి ప్రాతినిధ్యం వహించిన బి జి పి ,కాంగ్రెస్ అభ్యర్థులు ఏనాడు పట్టభద్రుల సమస్యలను పట్టించుకోలేదని వారి సమస్యలను గాలికి ఒదిలేసారని ఎద్దేవా చేసారు. పి వి కుమార్తె సురభి వాణి గొప్ప సాహితి వేత్త అని మచ్చ లేని వ్యక్తీ అని మంత్రి పేర్కొన్నారు. టి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే కలిగే ప్రయోజనాలను ఓటర్లకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఉపాద్యాయుల, పట్టభద్రుల సమస్యలను తీర్చే భాద్యత మాదే అని మంత్రి భరోసా కల్పించారు.
హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ కెసిఆర్ పతకాలు దేశానికే ఆదర్శం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న పతకాలు కేంద్రం కాపి కొడుతుందని పేర్కొన్నారు. టి ఆర్ ఎస్ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించి ఆశిర్వదించాలని పిలుపునిచ్చారు. కేంద్రం లో ఉన్న బీ.జే.పి నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామన్యుని నడ్డి విరిచిందని గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానికి అంటాయని ఓట్లు వేసే మేధావులు, యువకులు ఆలోచించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో ఎం.ఎల్.సి లు శేరి సుభాష్ రెడ్డి, నారదాస్ లక్ష్మణ్ రావు , భాను ప్రసాద్ రావు , ఎం.ఎల్.ఎ లు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, అరికెపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్ , ముటా గోపాల్, కాళేరు వెంకటేష్, సాయన్న, సుంకే రవిశంకర్ , రసమయి బాల కిషన్ , కోరుకంటి చందర్ , డాక్టర్ సంజయ్ కుమార్ , మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.