మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా 5లీ పెట్రోల్

52
petrol price

రోజురోజుకి పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూలేని విధంగా పలు రాష్ట్రాల్లో సెంచరీ మార్క్ దాటగా మరికొన్ని రాష్ట్రాల్లో సెంచరీ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. పెట్రో ధరల పెంపుపై ప్రజల నుండి నిరసన వస్తున్న, నెటిజన్ల నుండి సెటైర్లు వస్తున్న కేంద్రం మాత్రం చమురు ధరల పెంపుకు అడ్డుకట్ట వేయలేకపోతోంది.

ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన క్రికెట్ టోర్న‌మెంట్‌లో మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు గెలిచిన ఆట‌గాడికి అయిదు లీట‌ర్ల పెట్రోల్‌ను ప్రైజ్‌గా అంద‌జేశారు. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో స‌లాహుద్దీన్ అబ్బాసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు. నిర్వాహ‌కులు ఆ క్రికెట‌ర్‌కు 5 లీట‌ర్ల పెట్రోల్ డ‌బ్బాను ప్రైజ్‌గా అంద‌జేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.