పార్టీ సభ్యత నమోదుకు అత్యంత ప్రాధాన్యత- మంత్రులు

162
Minister errabelli
- Advertisement -

పార్టీని మనం కాపాడితే మనని పార్టీ కాపాడుతుందని, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత నమోదును అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని అత్యధిక సభ్యత్వాలు చేయాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ అన్నారు. పార్టీ సభ్యత్వాలను వెంట వెంటనే ఆన్లైన్ లో నమోదు చేసేందుకు 5000 మందికి ఒక కంప్యూటర్ పెట్టాలని సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సీరియస్ గా పని చేయాలని, ప్రతి పట్టభద్రున్ని పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకొచ్చే విధంగా 50 మందికి ఒక బాధ్యున్ని పెట్టీ జాగ్రత్తగా పర్యవేక్షించాలని చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదుపై ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో హరిత కాకతీయ హోటల్‌లో సమావేశం నిర్వహించారు.

సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, టి.ఎస్.ఐ. ఐ. సి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎంపీలు బండ ప్రకాష్,పసునూరి దయాకర్, మాలోత్ కవిత, పూర్వ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ లు కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, జెడ్పీ చైర్మన్లు సంపత్ రెడ్డి, సుధీర్, జక్కు శ్రీ హర్షిని, ఎమ్మేల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నన్నపనేని నరేందర్, రాజయ్య, అరూరి రమేష్, మేయర్ గుండా ప్రకాష్ రావు, చైర్మన్లు వాసుదేవ రెడ్డి, మర్రి యాదవరెడ్డి, రాజయ్య యాదవ్, మార్నెని రవీందర్ రావు, మాజీ ఎంపీలు గుండు సుధారాణి, సీతారాం నాయక్, పార్టీ సభ్యత్వ నమోదు నియోజక వర్గాల ఇంచార్జీలు లింగంపల్లి కిషన్ రావు, సాంబారీ సమ్మారావు, జన్ను జకారియ, భారత్ కుమార్ రెడ్డి, ఎడవెల్లి కృష్ణారెడ్డి, లలితా యాదవ్, గాంధీ నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -