‘రొమాంటిక్’ లుక్‌లో ఆకాశ్‌పూరీ-కేతిక శ‌ర్మ‌..

38
Romantic Movie New Poster

డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్‌పూరీ హీరోగా న‌టిస్తున్న చిత్రం రొమాంటిక్. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అనిల్ పాడూరి డైరెక్ట్ చేస్తున్నాడు. పూరీ, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఆకాశ్‌పూరీకి హీరోగా ఇది మూడో చిత్రం.

ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్‌ లాక్‌డౌన్ కు ముందే విడుద‌ల‌వ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా పూరీ అండ్ టీం చాలా గ్యాప్ త‌ర్వాత మ‌రొక‌ రొమాంటిక్ లుక్ విడుద‌ల చేశారు. కేతిక శ‌ర్మ‌, ఆకాశ్ రొమాంటిక్ మూడ్‌లో ఉన్న స్టిల్ ను రిలీజ్ చేస్తూ..సినిమా విడుద‌ల తేదీని మార్చి 1న ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపింది చిత్ర‌యూనిట్‌.