- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 13,742 పాజిటివ్ కేసులు నమోదుకాగా 104 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,30,176కు చేరింది.
ప్రస్తుతం దేశంలో 1,46,907 యాక్టివ్ కేసులుండగా 1,07,26,702 మంది ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 1,56,567 మంది మృతిచెందారు. టీకాడ్రైవ్లో భాగంగా 1,21,65,598 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తెలిపింది.
- Advertisement -