ఎమ్మెల్సీగా పల్లాను గెలిపించండి: ఎర్రబెల్లి

119
errabelli
- Advertisement -

లెక్కలతో సహా అభివృద్ధి మీద సవాల్ విసిరిన పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్ ను గ్రాడ్యుయేట్ ఓటర్లు గమనించాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దమ్ముంటే ప్రత్యర్థి పార్టీలు స్వీకరించాలి….పల్లా రాజేశ్వర్ రెడ్డి డైనమిక్ అభ్యర్థి కావడం మన అదృష్టం. మంచి చదువు, వాక్ పటిమ ఉన్న నేత. ఎవరైనా ఉద్యోగాల గురించి అడిగితే, లెక్కలు చెప్పి మరీ నిలదీయాలి. మీరేం చేశారు అని అడగాలి. ప్రశ్నించాలి. అబద్ధాల నిగ్గు తేల్చాలన్నారు.

రాష్ట్రం నుండి రూ. 2.70 లక్షల కోట్ల ను పన్నులు కడితే, కేవలం రూ. 1.45లక్షల కోట్లు మాత్రమే తిరిగి ఇస్తున్నది. ఇది నిజమా? కాదా? బిజెపి వాళ్ళు చెప్పాలి. నేను సవాల్ విసురుతున్న, ఛాలెంజ్ చేస్తున్న. దమ్ముంటే నిరూపించండన్నారు. మన జేబులు కొట్టి, మనకే అన్నం పెడుతున్నట్లు బీజేపీ నటిస్తుంది…అయితే అదాని, కాకపోతే అంబానీలకు ప్రభుత్వ కంపనీ లను అమ్ముతున్నారు. అంతా ప్రైవేట్ మయం చేస్తున్నారు బిజెపి చేసే అబద్ధాల మాటలు నమ్మొద్దు. ఉద్యోగాల పేరుతో ప్రశ్నిస్తున్న బీజేపీ మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలన్నారు.

మోడీ ఇస్తామన్న ఉద్యోగాలు ఏవి? ప్రజల ఖాతాల్లో 15లక్షల చొప్పున పడ్డాయా? పెట్రోల్, డిసిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. మన రాష్ట్రంలో సీఎం కెసిఆర్ తరహా పథకాలు, అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రం లోనైనా ఉన్నాయా? పోనీ బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మన పథకాలు అమలు అవుతున్నాయా? ప్రజలు, విజ్ఞులైన పట్టభద్రుల ఓటర్లు విశ్లేషించుకోవాలి. ఎవరైనా సీఎం కెసిఅర్ నీ, మన trs పార్టీ నీ ప్రశ్నిస్తే, వాళ్ళని నిలదీయాలి. కేంద్ర రైతు వ్యతిరేక బిల్లులను నిరసించాలి. మొన్న బడ్జెట్ లో మనకు మొండి చేయి చూపారు. వాళ్లకు మన మీద ప్రేమ ఉండదు. డబ్బాలు తయారు చేసే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వమంటే, డబ్బాలు కడిగే ప్రాజెక్టు ఇస్తారా? మేమిచ్చిన భూమి విలువ కంటే, ఆ ప్రాజెక్ట్ విలువ తక్కువ.మీ దయ వల్ల నేను ఎమ్మెల్యే గా గెలిచి, కెసిఆర్ దయవల్ల మంత్రి అయ్యా. పెద్ద శాఖలు ఇచ్చారు. నమ్మకంగా, పట్టుదలతో పని చేస్తున్న. అనేక అవార్డుల ను కేంద్రం ఇస్తున్నది. కానీ, నయా పైసా ఇవ్వడం లేదన్నారు.

ఈ ప్రాంత అభివృద్ధి నా బాధ్యత. మీ సమస్యల పరిష్కరిస్తా. ఓట్లు వేయాలి, అందరితో వేయించాలి.పాలకుర్తి నియోజకవర్గ నిరుద్యోగ యువతకు… గతంలో 40రోజుల పాటు ఉచిత, ఉపాధి శిక్షణతో పాటు, ఉచిత భోజన, ఉండే వసతి కల్పించాం. అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయి. మళ్ళీ పెడదామని ఏర్పాట్లు చేసిన. కానీ ఎన్నికల కోడ్ అడ్డం వచ్చింది. ఈ ఎన్నికల తర్వాత మళ్లీ ఉచిత కోచింగ్ పెడతా. అనంతరం వివిధ ప్రైవేట్ కంపెనీ లలో అవకాశాలు కల్పిస్తాం అన్నారు.

- Advertisement -