సిరిసిల్లకు మంత్రి కేటీఆర్…

267
ktr minister
- Advertisement -

మంత్రి కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు గంభీరావుపేటలో రైతువేదిక అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ పాఠశాలను ప్రారంభిస్తారు. తర్వాత మహిళలకు కుట్టుమిషన్లు, శిక్షణ పత్రాలు పంపిణీ చేయనున్నారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు నర్మాలలో రైతు వేదికను ప్రారంభించనున్నారు. తర్వాత ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. నర్మాలలో శ్మశానవాటిక, పాఠశాలలో అదనపు తరగతిగదులను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కొత్తపల్లిలో మహిళాసంఘం నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు లింగన్నపేటలో రైతు వేదికను ప్రజలకు అంకితం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు మల్లారెడ్డిపేటలో రైతువేదిక ప్రారంభోత్సవానికి హాజరవుతారు.

- Advertisement -