బడ్జెట్ 2021: రహదారుల అభివృద్ధికి 1.18 లక్షల కోట్లు

129
FM Nirmala
- Advertisement -

2021-2022 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభ ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి, ప్రజా రవాణాకు 2021-22 బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించామని ఆమె చెప్పారు. కొత్తగా 13వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో రూ.25 వేల కోట్లతో 675 కి.మీ హైవేల అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. అసోంలో రూ.18 వేల కోట్లతో హైవేల అభివృద్ధి చేపట్టనున్నట్టు తెలిపారు.

కేరళలో 1100 కిలో మీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. 2022 జూన్‌ నాటికి తూర్పు, పశ్చిమలో సరకు రవాణా కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఖరగ్‌పూర్‌- విజయవాడ మధ్య ఈస్ట్‌- కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

- Advertisement -