బడ్జెట్ 2021.. రూ 64,180 కోట్లతో ఆరోగ్య పథకం..

158
Nirmala Sitharaman
- Advertisement -

2021-2022 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభ ముందుంచారు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య నిర్మల తన ప్రసంగాన్ని ప్రారంభించారు.గతంలో ఎన్నడూ చూడని పరిస్థితుల మధ్య నేను బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నాను. అంటూ మూడవ సారి నిర్మల బడ్జెట్‌ను చదవడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య మౌలిక వసతులకు ఈ బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు జరిపామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌లో రూ.21.17 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈదేశం మూలాల్లోనే ఆత్మనిర్భర్‌ భావం ఉందని, ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం కృష్టి చేస్తామన్నారు. రానున్న ఆరేళ్లలో ఆరోగ్య రంగంలో రూ.64, 180 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రూ.64, 180 కోట్లతో పీఎం ఆత్మనిర్భర ఆరోగ్య పథకం తీసుకురానున్నట్టు తెలిపారు. నివారణ, చిక్సిత, సంపూర్ణ ఆరోగ్య విధానంలో పథకం ఉండనుందన్నారు.ఇక 2022 ఆర్థిక సంవత్సరంలో 2.24 లక్షల కోట్లు ఆరోగ్య రంగంలో వెచ్చిస్తామని చెప్పారు.

కరోనా మహ్మరితో పోరాడుతూ అత్యవసర రంగంలో పనిచేసిన వారందరూ ప్రాణాలొడ్డి పనిచేశారని అన్నారు. గతంలో ఎన్నడూ చూడని పరిస్ధితులు ఎదురయ్యాయని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం 27 లక్షల కోట్ల ప్యాకేజ్‌లను ప్రకటించిందని చెప్పారు. కరోనా కట్టడికి భారత్‌లో రెండు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. వంద దేశాలకు భారత్‌ టీకాలను ఎగుమతి చేస్తోందని వివరించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ను ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

- Advertisement -