దేశ చ‌రిత్ర‌లో తొలిసారి డిజిట‌ల్ బ‌డ్జెట్..

219
FM Nirmala Sitharaman
- Advertisement -

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బడ్జెట్ ప్రతులతో కలిసి క్యాబినెట్ సమావేశానికి బయలుదేరారు. దేశ చ‌రిత్ర‌లో తొలిసారి కేంద్ర బ‌డ్జెట్ పేప‌ర్‌లెస్‌గా మారింది. క‌రోనా నేపథ్యంలో కేంద్ర బ‌డ్జెట్ డిజిట‌ల్ రూపంలో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. ఈ ఏడాదికి సంబంధించిన బ‌డ్జెట్‌ను ఇవాళ ఉదయం 11 గంటలకు పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. అయితే ఈ సారి బ‌డ్జెట్‌ను ఐప్యాడ్‌లో పొందుప‌రిచారు. సాంప్ర‌దాయ‌క‌మైన‌ బ‌హీఖాతా పుస్త‌కం బ‌దులుగా .. లోక్‌స‌భ‌లో ఐప్యాడ్ ద్వారా మంత్రి 2021-22 బ‌డ్జెట్‌ను చ‌ద‌వి వినిపించ‌నున్నారు.

ఎర్ర‌టి బ్యాగులో ఐప్యాడ్ ట్యాబ్లెట్‌తో మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ క‌నిపించారు. కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ‌మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా మంత్రి సీతారామ‌న్‌తో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ చేరుకున్నారు. పేప‌ర్‌లెస్ బ‌డ్జెట్‌గా గుర్తింపు పొందిన తాజా బ‌డ్జెట్‌కు సంబంధించిన సాఫ్ట్ కాపీని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచ‌నున్నారు. మంత్రి సీతారామ‌న్ ఇవాళ 11 గంట‌ల‌కు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతార‌ని, డిజిట‌ల్ రూపంలో ఆ బ‌డ్జెట్ ఉంటుంద‌ని, దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్ల‌ను indiabudget.gov.in పోర్ట‌ల్ లేదా యూనియ‌న్ బ‌డ్జెట్ మొబైల్ యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా ట్వీట్ చేశారు.

- Advertisement -