విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన వద్దు: సబితా ఇంద్రారెడ్డి

157
sabitha
- Advertisement -

ఫిబ్రవరి 1 నుండి స్కూల్స్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం విషయంపై ఆందోళన వద్దని తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. విద్యాసంస్థలు, గురుకులాలు, వసతి గృహాలు తెరవడంపై మంత్రులు సబితా, సత్యవతి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సమీక్ష నిర్వహించారు.

విద్యాసంస్థలు ప్రారంభించేందుకు ఈనెల 25లోపు సిద్ధం కావాలని సూచించారు. తరగతి గదిలో విద్యార్థుల మధ్య కనీసం ఆరడుగుల దూరం ఉండాలన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 9వ తరగతి నుంచి ఆపై కోర్సులకు తరగతులు ప్రారంభించాలన్నారు. పుస్తకాలు, యూనిఫారాలు ఇప్పటికే చేరవేశాం… విద్యార్థుల హాజరు విషయంలో ఎలాంటి ఒత్తిడి ఉండదన్నారు.

- Advertisement -