దేశం గర్వించదగ్గ సమయమిది:తమిళి సై

173
tamilisai
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నిమ్స్ హాస్పిటల్‌లో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ మాట్లాడుతూ ఇది దేశం గర్వించదగిన సమయం అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ,శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం ఎంతో కృషి చేశారని వెల్లడించారు..

మొదట ఫ్రాంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సిన్ అందుతుందని తెలిపిన గవర్నర్…..డాక్టర్లు, మెడికల్ సిబ్బంది ,పారిశుద్ధ్య కార్మికుల కు వ్యాక్సిన్ ప్రారంభమైందన్నారు. ప్రజలంతా మస్కులు ధరించాలి ,సోషల్ డిస్టన్స్ పాటించాలన్నారు. మనదేశంలో వ్యాక్సిన్ విడుదల కావడం చాలా గర్వంగా ఉందన్నారు.

హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ కు చెందిన కోవగ్జిన్ కూడా అందుబాటులో కి రానుంది..అన్ని పరీక్షలు పూర్తి చేసుకుంటుందన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రారంభమైంది…ఒక్కో సెంటర్ లో 30 మంది వారియర్స్ కి వ్యాక్సిన్ ఇస్తున్నాం అన్నారు. 10 నెలలు కోవిడ్ తో ఎన్నో ఇబ్బందులు పడ్డాం..ఇంతకుముందు కోవిడ్ తో పోరాడుతున్న డాక్టర్ల దగ్గరకు వచ్చాను..ఇప్పుడు వ్యాక్సిన్ అందించే సమయంలో మరోసారి నిమ్స్ కి వచ్చానని తెలిపారు గవర్నర్.

వ్యాక్సిన్ విషయంలో ఎవరికి భయం ,ఆందోళన అవసరం లేదు..అన్ని పరీక్షల తరువాతే వ్యాక్సిన్ వచ్చిందన్నారు.ఏదైనా రియాక్షన్ వచ్చిన డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు గవర్నర్ తమిళి సై.

- Advertisement -