స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

179
Minister KTR
- Advertisement -

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు నగరంలోని పలు ప్రాంతల్లో పర్యటించారు. ఇందుల భాగంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని అడిక్‌మెట్‌లో కొత్త‌గా నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి క్రీడాకారులతో బాడ్మింటన్‌ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.ఈ బ‌హుళ వినియోగ క్రీడా భ‌వ‌న కాంప్లెక్స్ లో బాస్కెట్ బాల్ కోర్టు, బ్యాడ్మింట‌న్ కోర్టు, టేబుల్ టెన్నిస్‌, జిమ్ సౌక‌ర్యంతో పాటు ఇండోర్ గేమ్స్ ఆడుకునేందుకు వ‌స‌తులు క‌ల్పించారు.ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి శ్రీ కిష‌న్ రెడ్డి, మంత్రులు శ్రీ మ‌హ‌ముద్ అలీ, శ్రీ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యే శ్రీ ముఠా గోపాల్‌, మేయ‌ర్ శ్రీ బొంతు రామ్మోహ‌న్‌ పాల్గొన్నారు.

అలాగే బాగ్ లింగంపల్లి లంబాడీ తాండా కాలనీలో పేదల కోసం సకల హంగులతో రూ. 10 కోట్ల 90 ల‌క్ష‌ల‌తో నిర్మించిన 126 డ‌బుల్ బెడ్రూం ఇండ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ,ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పాల్గొన్నారు.

అనంతరం ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు కొత్త పేట్ లో నిర్మించిన 2.5 ఎంఎల్‌ (మిలియన్ లీటర్లు) సామర్ధ్యం గల రెండు మంచినీటి రిజర్వాయర్లను మంత్రికేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే శ్రీ సుధీర్ రెడ్డి, మేయ‌ర్ శ్రీ బొంతు రామ్మోహ‌న్‌ పాల్గొన్నారు.

- Advertisement -