బోయిన్‌ పల్లి కిడ్నాప్‌ కథ సుఖాంతం..

159
police
- Advertisement -

హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో అర్థరాత్రి కిడ్నాప్‌ కలకలం సంచలనం సృష్టించింది. మాజీ హాకీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరులను దుండగులు అపహరించారు. బోయిన్‌పల్లిలోని వారి నివాసానికి ఐటీ అధికారులమంటూ మూడు కార్లలో వచ్చిన దుండగులు.. ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావులను కిడ్నాప్‌ చేశారు.

అయితే కిడ్నాప్ వార్తలతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగగా కిడ్నాప్‌కు గురైన ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. నార్సింగిలో ముగ్గురిని కిడ్నాపర్లు వదిలి పారిపోయారు. దీంతో ప్రవీణ్, నవీన్, సునీల్ సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. వీరు ముగ్గురూ సీఎం కేసీఆర్‌ పీఏ వేణుగోపాలరావుకు బావమరుదులు.

కిడ్నాపర్లు భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రవీణ్‌రావు సహా ఇద్దరు సోదరులను దుండగులు కిడ్నాప్‌ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కిడ్నాపర్లపై మొత్తం ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -