వకీల్ సాబ్..గుమ్మడికాయ కొట్టేశాడు

151
pawan
- Advertisement -

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ – వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్ సాబ్’. ఇటీవలె పవన్ కల్యాణ్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తికాగా తాజాగా సినిమా షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేశారు.

పవన్ సరసన శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించగా నివేదా థామస్,అంజలి,అనన్య నాగెళ్ల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ…పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని ఎప్పటినుండో ఉంది…అది ఇప్పటికి నెరవేరిందన్నారు. పవన్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉంటుందని తెలిపారు.

పవన్‌తో సినిమా నిర్మించాలన్న తన కల నెరవేరిందన్నారు దర్శకుడు వేణు శ్రీరామ్. ఇందుకు సహరించిన నిర్మాతలు బోనీ కపూర్, దిల్ రాజులకు స్పెషల్ థాంక్స్ తెలిపారు.

తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. మామిడాల తిరుపతి మాటలు రాశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. రవి వర్మ యాక్షన్ డైరెక్టర్.

- Advertisement -