కరోనా వ్యాక్సిన్‌‌ వచ్చేసింది.. కొవాగ్జిన్‌, కోవిషీల్డ్‌కు ఆమోదం..

260
Corona Vaccines
- Advertisement -

భారత ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న సమయం వచ్చేసింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌‌ వచ్చేసింది. దేశం‌లో కొవాగ్జిన్‌తో పాటు కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్య‌వ‌స‌ర వినియోగానికి డీసీజీఐ అనుమ‌తి ఇచ్చింది. ఆ రెండు వ్యాక్సిన్ల అత్య‌వ‌స‌ర వినియోగానికి సీడీఎస్‌సీవో ఇటీవ‌లే సిఫార‌సు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి ఇచ్చిన‌ట్లు డీసీజీఐ ప్ర‌క‌టించింది.

అయితే క్లినికల్‌ ట్రయల్స్ మాత్రం కొనసాగుతాయని డీసీజీఐ డాక్టర్ వి.జి. సోమని తెలిపారు. ఇక జైడుస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డీ వాక్సిన్‌ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సీన్‌లను రెండు డోస్‌లు వేసుకోవాల్సి ఉంటుందని డీసీజీఐ తెలిపింది. జైకోవ్-డీ వ్యాక్సీన్‌ను మూడు డోసులు వేసుకోవాలని వెల్లడించింది.

వ్యాక్సిన్‌ భ‌ద్ర‌త‌, స‌మ‌ర్థ‌తపై సీరం సంస్థ పూర్తి వివ‌రాలు స‌మ‌ర్పించింద‌ని చెప్పింది. ఐసీఎంఆర్‌, ఎన్ఐవీతో క‌లిసి భార‌త్ బ‌యోటెక్ కొవాగ్జిన్ ను త‌యారు చేసింద‌ని వివ‌రించింది. కొవాగ్జిన్ సుర‌క్షిత‌మ‌ని ఇప్ప‌టికే నిర్ధార‌ణ అయింద‌ని చెప్పింది. తొలి రెండు ద‌శ‌ల్లో మొత్తం 800 మందిపై కొవాగ్జిన్ ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంత‌మ‌య్యాయని డీసీజీఐ చెప్పింది.

అలాగే, మూడో ద‌శ‌లో 25,800 మంది వాలంటీర్ల‌కు కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చార‌ని వివ‌రించింది. ఇప్ప‌టికే ఆయా వ్యాక్సిన్ల‌కు సంబంధించిన కోట్లాది డోసుల‌ను అభివృద్ధి చేశారు. మొద‌టి ద‌శ వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా మూడు కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్లు వేయ‌నున్నారు. ఇప్ప‌టికే డ్రైర‌న్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అధికారులు వ్యాక్సిన్ పంపిణీపై శ‌ర‌వేగంగా చర్య‌లు తీసుకుంటున్నారు. ఈ ఏడాది జులై నాటికి దాదాపు 30 కోట్ల మందికి వ్యాక్సిన్లు అందించనున్నారు.

కాగా, భార‌త్ లో సీరం తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం ఇటీవ‌ల గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విష‌యం తెలిసిందే. కొవ్యాగ్జిన్ ను భారత్‌ బయోటెక్ ఇండియాలో అభివృద్ధి చేసింది. ఈ సంస్థ కూడా అనుమ‌తులుకు దరఖాస్తు చేసుకోవ‌డంతో నిపుణుల కమిటీ ఆదివారం సమావేశమై నిర్ణ‌యం తీసుకుంది. దీంతో అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తులు వ‌చ్చాయి.

- Advertisement -