- Advertisement -
కరోనా సెకండ్ వేవ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు మంత్రి ఈటల రాజేందర్. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ లేదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో అనవసర ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఈటల…ఫస్ట్ వేవ్ కూడా తగ్గముఖం పట్టిందని చెప్పారు.
బ్రిటన్ నుంచి వచ్చినవారి నమూనాలను సీసీఎంబీకి పంపించామని, వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చిందన్నారు. రోజుకు 10 లక్షల మందికైనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని…ఉష్ణోగ్రతలు పెరిగితే కరోనా మొదటి దశ అంతమయ్యే అవకాశం ఉందని చెప్పారు.
- Advertisement -