ఎఫ్‌ 3…మూడింతల కామెడీ!

46
f3

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌- వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్‌ 2. సంక్రాంతి రేసులో వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకోగా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ బర్త్ డే సందర్భంగా ఎఫ్‌ 3 పోస్టర్‌ని రిలీజ్‌ చేయగా షూటింగ్‌ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

నూతన సంవత్సరం సందర్భంగా ఎఫ్ 3 నుండి మ‌రో పోస్ట‌ర్ విడుద‌లైంది. ఇందులో వెంకీ, వ‌రుణ్‌లు డ‌బ్బుల‌ని చూసి మైమ‌రచిపోతున్న‌ట్టు క‌నిపిస్తున్నారు. ఈసారి మూడింతల వినోదంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు వ‌స్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం సెట్స్ పై ఉంది. స‌మ్మ‌ర్‌కు సినిమా రిలీజ్ కానుంది.