తెలుగు బిగ్‌బాస్ 4 సీజన్ తుది అంకానికి చేరుకుంది. 4 సీజన్ విజేత ఎవరో మరికాసేపట్లో తేలనుంది. స్టార్ మా టీవీలో ప్రస్తుతం బిగ్‌బాస్ నాల్గో సీజన్ గ్రాండ్ ఫినాలే ప్రసారం అవుతోంది. డాన్ సినిమాలోని ‘సూరి అన్న’ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. పువ్వుల షేర్వానీలో నాగ్ లుక్ అదిరిపోయింది. బిగ్‌బాస్‌ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతులు చెప్పారు. అలాగే మూడో సీజన్ ఫినాలేకు 8 కోట్ల రాగా.. నాల్గో సీజన్‌కు రికార్డు స్థాయిలో 15.65 కోట్ల ఓట్లు వచ్చాయని నాగ్ వెల్లడించారు. నాగార్జున ఎంట్రీ తరవాత బిగ్ బాస్ సీజన్ 4 నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు 14 మంది స్టన్నింగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఎంటర్‌టైన్ చేశారు.
ఇక లీకులు, ఊహాగానాల సంగతి అటుంచితే… ఇప్పటికే విడుదలైన గ్రాండ్ ఫినాలే ప్రోమో ఫైనల్ ఎపిసోడ్ పై మరింత ఆసక్తి పెంచుతోంది. ప్రోమో చూస్తే లక్ష్మీరాయ్, ప్రణీత, మెహ్రీన్ బిగ్ బాస్ వేదికపై తళుక్కున మెరవనున్నట్టు తెలుస్తోంది. యువ దర్శకుడు అనిల్ రావిపూడి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లికి ఎలిమినేట్ అయిన వారిని బయటికి తీసుకురానున్నారు. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పోటీచేసిన బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఫైనల్ వీక్ కు ఐదుగురు మిగిలారు. అభిజిత్, అఖిల్, అరియానా, సొహైల్, హారిక టైటిల్ రేసులో ఉరకలేస్తున్నారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన 14 మంది ఇంటి సభ్యులు కూడా గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కు రావడంతో మరింత సందడి నెలకొంది.