- Advertisement -
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి 31 వేలు దాటాయి. గత 24 గంటల్లో 26,624 పాజిటివ్ కేసులు నమోదుకాగా 341 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటీ 31,223కు చేరింది.
ప్రస్తుతం దేశంలో 3,05,344 యాక్టివ్ కేసులుండగా 95,80,402 మంది కరోనా నుండి కోలుకున్నారు. 1,45,477 మంది బాధితులు కరోనాతో మరణించారు. యాక్టివ్ కేసుల్లో కేరళ, మహారాష్ట్రలోనే 40 శాతం ఉన్నాయని తెలిపింది.
గత 24 గంటల్లో 11,07,681 మందకి కరోనా పరీక్షలు నిర్వహించగా డిసెంబర్ 19 నాటికి మొత్తం 16,11,98,195 నమూనాలకు కరోనా పరీక్షలు చేశామని ఐసీఎంఆర్ తెలిపింది.
- Advertisement -